అల్లు అర్జున్ అరెస్టుపై ఆర్జీవీ ప్రశ్నలు...! 8 d ago
హీరో అల్లు అర్జున్ అరెస్టుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎక్స్' వేదికగా పలు ప్రశ్నలు వేశారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లని అరెస్ట్ చేస్తారా?, ఒకవేళ ఎన్నికల ప్రచారాల్లో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే నాయకులను అరెస్ట్ చేస్తారా?, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లు పోలీసులు, ఆర్గనైజర్ల బాధ్యత. అంతేకానీ హీరోలు, రాజకీయ నేతలు ఎలా కంట్రోల్ చేస్తారని ఆర్జీవీ మండిపడ్డారు.